19 May, 2026 | 2:10 AM

కాళేశ్వరానికి సరికొత్త శోభ

19-05-2026 12:50 AM
  1. వేగంగా సాగుతున్న పుష్కర ఏర్పాట్లు 
  2. మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు
  3. పరిశీలించిన కలెక్టర్ రాహుల్‌శర్మ

కాళేశ్వరం (మహబూబాబాద్), మే 18 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం సరికొత్త శోభను సంతరించుకోనుంది. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ పుష్కరాలను ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. కాగా సోమవారం పుష్కర ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి పరిశీలించారు.

ప్రధాన ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్.. భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. భక్తులు సమాచారం తెలుసుకు నేలా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హెలిప్యాడ్‌ను పరిశీలించి, హెలిప్యాడ్ చు ట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, నీరు చల్ల డం, ప్రధాన ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై నిరంతరం నీటిని చల్లాలని ఆదేశిం చారు.

సరస్వతి ఘాట్, భక్తులు బట్టలు మా ర్చుకునే గదులు, షవర్ ట్యాప్స్ వంటి సదుపాయాలను పరిశీలించారు. గోదావరి నది లో నీటి మట్టాన్ని పరిశీలించి, భద్రతా చర్యలల్లో భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రతి 50 మీటర్లకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. ఘా ట్ మెట్లపై వేసిన అచ్చుల డిజైన్లకు రంగులు వేయాలని, సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తున్న సదుపాయాలను వేగంగా పూర్తి చే యాలన్నారు.

అలాగే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని, టెంట్ సిటీ ప్రాంతాన్ని కూడా పరిశీలించా రు. మ్యూజియాన్ని పరిశీలించిన కలెక్టర్ స మయం తక్కువగా ఉన్నందున ముఖ్యమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని  సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్ట ర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, ఇరిగేష న్, ఆర్ అండ్ బీ, పంచాయతి రాజ్, విద్యుత్తు శాఖల అధికారులు ఉన్నారు.