28 February, 2026 | 6:29 AM

అంచెలంచెలుగా ఎంఈవో స్థాయికి

28-02-2026 02:27 AM

ఎన్నో ఉద్యోగాలోచ్చిన ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్న వైనం అంజల్ రెడ్డి

రామారెడ్డి మండలం అన్నారం గ్రామవాసి

సొంత మండలంలోని ఎంఈఓ బాధ్యతలు

రామారెడ్డి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చిన చివరికి తన కిష్టమైన ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకుని ఎందరివో మన్ననలను పొందుతూ ఓ ఉపాధ్యాయుడు అంచెలంచెలుగా ఎంఈవో స్థాయికి చేరుకున్నాడు. ఎంత  ఎదిగిన ఒదిగివుండే మనస్తత్వంతో ముందుకు సాగుతున్న ఉపాధ్యాయుడు వంచ అంజల్ రెడ్డి. మండలంలోని అన్నారం గ్రామానికి చెందినవారు. వంచ అంజల్ రెడ్డి ప్రాథమిక విద్య అన్నారంలో, ఉన్నత విద్య రెడ్డిపేట పాఠశాలలో పూర్తి చేసి ఇంటర్మీడియట్,డిగ్రీ విద్యాభ్యాసం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు.

డిగ్రీ చదువుతుండగానే ఎన్ సీసీలో సీ సర్టిఫికేట్ పొంది, డిల్లీలో జరిగే రిపబ్లిక్ డేకు ఎన్నికై పరేడ్ లో పాల్గోని అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా పరేడ్ సర్టిఫికేట్ అందుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఢిల్లీ పరేడ్ కు ఎంపికైన విద్యార్థులలో మూడవ విద్యార్థిగా రికార్డు నమోదు చేశారు. అనంతరం పీజీ చదువుతుండగానే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిన ఆర్మీ ఉద్యోగం వచ్చిన ఇంకా ఎన్నో ఉద్యోగావకాశాలు అందివచ్చిన తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకుని సాధించారు.

తన మొదటి పోస్టింగ్ స్వగ్రామం అన్నారంలోనే చదువుకున్న పాఠశాలలోనే ఉపాద్యాయుడుగా చేరి సుమారుగా పదిహేళ్ళుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు.అనంతరం  ధర్మారావుపేట, తలమడ్ల తదితర ప్రాంతాల్లో పనిచేస్తూనే స్కూల్ అసిస్టెంట్ గా, అనతికాలంలోనే పీజీ హెచ్‌ఎంగా పదోన్నతి పొందారు.సుమారుగా మూడు దశాబ్దాల అనంతరం లింగంపేట మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించారు. దీంతో స్వంత గ్రామం అన్నారంలో పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.