15 June, 2026 | 4:55 AM

రేపు బీసీ ముస్లింల రాష్ట్రస్థాయి సభ

15-06-2026 02:13 AM
  1. రవీంద్రభారతిలో నిర్వహణ
  2. 150 మంది సర్పంచులకు సన్మానం

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలో తరతరాలుగా చేతివృత్తులు, చిన్న చిన్న పనులు, పాత వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న బీసీ ముస్లింల ఇబ్బందులు, వారికి రావాల్సిన, రాజకీయల్లో వాటా, కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలపై జూన్ 16న హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సభ నిర్వహించనున్నారు. ఆల్ ఇండియా బీఎస్పీ జాతీయ సమన్వయకర్త డా జె. పూర్ణచంద్రరావు, (రిటైర్డ్ డీజీపీ), బీసీ టైమ్స్ సంపాదకులు సంగెం సూర్యారావు ఎంఎ వహీద్, ఐఎఫ్‌ఎస్ రిటైర్డ్ ఆధ్వర్యంలో ఈ సభ జరుగనుంది. తెలంగాణ జనాభాలో ముస్లింలు దాదాపు 12 శాతం ఉన్నప్పటికీ, 119 మంది సభ్యుల శాసనసభలో కేవలం 7 మంది మాత్రమే ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు.

వారిలో ఒక్కరు కూడా బీసీ ముస్లిం వర్గాలకు చెందిన వారు లేరని బీసీ ముస్లిం సంఘాలు చెపుతున్నాయి. ఈ సభలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువత, మహిళలు, సామాజిక రంగంలో పనిచేసే వారు పాల్గొంటారు. బీసీ ముస్లింలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, విద్యలో వాటా, ఉద్యోగాల్లో అవకాశాలు, ఎన్నికల్లో చోటు, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చ జరగనుంది. అలాగే గ్రామాల్లో ప్రజల కోసం పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్న 150 మంది బీసీ ముస్లిం సర్పంచులను ఈ సభలో ఘనంగా సన్మానించనున్నారు.