calender_icon.png 7 February, 2026 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో మెరికల్ లు పాత ఎల్లాపూర్ విద్యార్థులు

07-02-2026 08:04:40 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి క్రీడా పోటీల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు తమ సత్తా చాటి ముందుకు దూసుకుపోతున్నారు. ఇటీవల మండల స్థాయి క్రీడా పోటీల్లో తమ ప్రతిభ కనబరిచి శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి షాట్ పుట్ క్రీడలో ఏ. మమత బ్రాంజ్ మెడల్ సాధించగా, ఆత్యాపాత్య క్రీడలో అన్వేష్ మెడల్ సాధించారు. వీరిని ఆ గ్రామ సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. గ్రామస్తులు క్రీడాకారులను అభినందించారు.