30 June, 2026 | 10:04 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పేద రోగులకు అండగా..

29-04-2026 02:03 AM

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే ధన్ పాల్ 

ఇందూరు, ఏప్రిల్ 28(విజయక్రాంతి): పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎల్‌వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం పలువురికి ఎల్‌వోసీ పత్రా లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్‌వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని మాలపల్లికి చెందిన అహ్మది బేగం నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో నిమ్స్‌లో చికిత్స పొందుతు న్న నేపథ్యంలో రూ.5 లక్షల ఎల్ వోసీ అందజేశా మన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పం దించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.