30 June, 2026 | 9:08 PM

Breaking News

తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •  

మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం

29-04-2026 02:01 AM
  1. బ్యాటరీ పేలుడుతో కార్లు, బైక్ దగ్ధం 
  2. మంటలను అదుపు చేసిన డిఫెన్స్ ఫైర్ సిబ్బంది
  3. అన్నారం వార్డులో ఘటన

గుమ్మడిదల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం వార్డు లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సోనీ మోటర్ మెకానిక్ షెడ్‌లో ఉన్న కారు బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించి షెడ్లో ఉన్న వాహనాలను ఆవరించాయి. ఈ ఘటనలో రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌తో పాటు షెడ్‌లోని పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్‌కు చెందిన ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని సకాలంలో మంటలను అదుపులోకి తేవడంతో మరింత నష్టం తప్పింది. స్థానిక పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.