16 March, 2026 | 12:30 PM

వైభవంగా ది మాస్టర్ మైండ్ స్కూల్ వార్షికోత్సవం

16-03-2026 12:00 AM

అట్టహాసంగా సాగిన సాంస్కృతిక వేడుకలు

జగదేవపూర్, మార్చి15: జగదేవపూర్ మండల కేంద్రంలోని ది మాస్టర్ మైండ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాఠశాల చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి,కరస్పాండెంట్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అ ట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సైదులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథిలు పాఠశాల యాజమాన్యం కలిసి జ్యోతి ప్ర జ్వలన చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

వీరితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశా ల యాజమాన్యం ఎంఈఓ సైదులుని, సర్పంచులను మెమెంటోలు, శాలువాలతో ఘనంగా స న్మానించారు.హోరెత్తించే డీజే పాటలకు విద్యార్థులు వేసిన స్టెప్పులతో హాల్ అంతా సందడిగా మారింది.హుషారైన సినిమా పాటలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే జానపద గీతాలకు చేసిన వివిధ రకాల ఈవెంట్స్, నాటికల ద్వారా విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకత ను చాటుతూ అందరినీ ఆకట్టుకున్నారు.

ముఖ్య అతిథి ఎంఈఓ సైదులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను,అద్భుతమైన వేదికను కల్పించిన చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, కరస్పాండెంట్ కిరణ్ రెడ్డి లను ఆయన ప్రత్యేకంగా అ భినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని, విద్యార్థుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు.