ఘనంగా శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలు
- కరీంనగర్ జిల్లాలో సంబరాల హోరు
- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద భారీ ఎత్తున ఉత్సవాలు
- బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి శ్రీధర్‌బాబు: నరేందర్‌రెడ్డి
- ఓ అభిమాని చేతిపై మంత్రి శ్రీధర్ బాబు పచ్చబొట్టు
- వివిధ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహణ
కరీంనగర్/కరీంనగర్ క్రైమ్/మంథని/ముత్తారం, మే 30 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జన్మదినం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు, అభిమానులు కరీంనగర్‌లోని ఇందిరా చౌక్‌తో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద వేడుకలు అంబురాన్ని అంటాయి.
కరీంనగర్ నియోజకవర్గంలో కే క్‌కటింగ్‌లు హోరెత్తాయి. రాగి జావా, మజ్జిగ పంపిణీ చేశారు. దేవాలయాల్లో ప్రత్యేక పూ జలు చేశారు. మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి, పూలచద్దర్ సమర్పించారు. ఆస్పత్రుల్లో రోగులకు, ఆశ్రమాల్లో వృద్ధు లు, దివ్యాంగులకు, బస్టాండుల్లో ప్రయాణికులకు, వాహనదారులకు మజ్జిగ, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతా ల్లో అన్నదానం చేశారు.
అలాగే మంథని నియోజకవర్గంలో, ముత్తారంలో కాంగ్రెస్ శ్రేణులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సం దర్భంగా కరీంనగర్‌లోని ఇందిరా చౌక్ వద్ద నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తోపాటు పలువురు నాయకులతో కలిసి ఆయన కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి కార్యకర్తకు ‘అన్నా’ అని పిలిస్తే ‘నేను ఉన్నా’ అని పలికే దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని నగరంలోని దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలో 80 ప్రాంతాల్లో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడు సా ర్లు మంత్రిగా సేవలందిస్తూ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారని అన్నారు.
తన తండ్రి శ్రీపాదరావు బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, మరె న్నో ఉన్నత పదవులు అధిరోహించాల ని కోరుకుంటున్నాం అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. శ్రీధర్‌బాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మంత్రిగా అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేసేందుకు భగవంతుడు ఆయనకు మరెన్నో గొప్ప పదవులు ప్రసాదించాలని కోరారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో కాంగ్రెస్ నేత వీర దేవేందర్ ఆధ్వర్యంలో, అంబేద్కర్ స్టేడియంలో గుడిపాటి రమణారెడ్డి ఆధ్వర్యంలో, పాలిటెక్నిక్ వెటర్నరీ కాలేజీ గ్రౌండ్‌లో కార్పొరేటర్ వరాల నర్సింగం, వాకర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో, కార్పొరేటర్ పడిశెట్టి వసంత భూమయ్య ఆధ్వర్యంలో, ఎస్సీ సెల్ నాయకులు జీడి రమేష్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
గాంధీ రోడ్డులోని వృద్ధులు, దివ్యాంగుల ఆశ్రమంలో, కరీంనగర్ బస్టాం డ్ ఎదుట, మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కరీముల్లాషా దర్గాలో, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నాగుల సతీష్ ఆధ్వర్యంలో, మైనారిటీ వైస్‌చైర్మన్ కలియుముద్దీన్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు జరిగాయి. అలాగే మం థని నియోజవకర్గంలో శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిం చాయి. అలాగే ముత్తారం మండలంలో, అ డవి శ్రీరాంపూర్ గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు జన్మదినం వేడుకులు మిన్నంటాయి.
చేతిపై మంత్రి శ్రీధర్‌బాబు పచ్చబొట్టు
తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పట్ల తనకున్న అమితమైన అభి మానాన్ని ఒకరు వినూత్నంగా చాటుకున్నారు. మంత్రి పుట్టినరోజు సందర్భం గా, తన చేతిపై శ్రీధర్ బాబు ముఖచిత్రాన్ని పచ్చబొట్టు(టాటూ) వేయించు కున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామానికి చెందిన అల్లాడి రఘునాథరావు మంత్రి శ్రీధర్‌బాబు వీరాభిమాని. రఘు ఈసా రి శ్రీధర్‌బాబు పుట్టిన రోజు సందర్భం గా పచ్చబొట్టు వేసుకొని అభిమానా న్ని చాటుకున్నాడు. ఇది ఇప్పుడు సో షల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వినూ త్న ప్రయత్నాన్ని చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రఘు అభి మానాన్ని అభినందిస్తున్నారు.






