1 August, 2026 | 1:36 AM

అన్నీ జూటా మాటలు

01-08-2026 12:49 AM
  1. హైడ్రాను మెచ్చుకుంటున్నట్లు భ్రమలో రేవంత్‌రెడ్డి
  2. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): హైడ్రాను దేశవ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటున్నారనే జూటా మాటలను కట్టబెట్టాలని, హైడ్రాను మెచ్చుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి భ్రమపడుతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈమేరకు ఆమె శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు.

గతంలో డిస్కవరీ ఛానెల్‌లో కాళేశ్వరం గురించి కేసీఆర్ గొప్పలు చూపించినట్లు...ఇప్పుడు హైడ్రా గురించి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా గురించి ఓట్లు వేసిన హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు అడిగితే చెప్తారని, ప్రజల కొంపలు..జీవితాలు కూల్చేందుకే హైడ్రా తయారైందన్నారు. హైడ్రా పై జూటా ప్రచారం ఇకనైనా మానుకోవాలని ఆమె మండిపడ్డారు.