31 May, 2026 | 1:01 AM

పేదలకు పెద్దన్న రేవంత్

31-05-2026 12:23 AM
  1. రేవంత్ కానుకగా తొలి విడతలో లక్ష ఇండ్లు
  2. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తాం
  3. పేదల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలు   
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి 
  5. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి) : ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలకు పెద్దన్న.. క్యూర్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇండ్లు నిర్మించి రేవంత్ కానుకగా ఇస్తాం’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. లక్ష ఇండ్లకు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేసి, ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా  పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజ నివా స ప్రాంతం నుంచి -40 కిలోమీటర్ల దూరం లో ఇండ్లు నిర్మించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అలా చేయదని, అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా అక్కడే ఇండ్లు కట్టించి, రేవంత్ కానుకగా అందజేస్తామని మంత్రి తెలిపారు. ఇది పేదోడి ప్రభుత్వమని, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని, దొరల ప్రభు త్వం కాదన్నారు.

దొర లు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటయ్.. కానీ, వేదిక దిగిన తరువాత దొరలకు వాళ్లు చెప్పి న మాటలు గుర్తుండవని విమర్శించారు. పేదవాడి గుమ్మం వద్దకే ప్రభుత్వ ఫలాలను చేరవేస్తామన్నారు. హైదరాబాద్ పరిధిలో మొదటి విడతలో లక్ష ఇండ్లు, మలివిడతలో మరో లక్ష ఇండ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.