calender_icon.png 14 February, 2026 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రికి ముస్తాబైన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం

14-02-2026 08:46:57 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరస్వామి వారి ఆలయంలో "మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవములు" త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ పానకాల సత్యనారాయణ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారము ఉదయం 3-00 గం|| లకు మంగళ వాయిద్యాలతో, స్వామివారికి అభిషేకాలు, ఉదయం గం|| 6-00 లకు దీక్షా దంపతులచే స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మండపార్చనలు ఉదయం గం|| 9-00 లకు రుద్రహావనము, లక్ష్మీనారాయణ దుర్గాహావనము,

ఉదయం గం|| 10-00 లకు మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, సాయంత్రం గం॥ 4-00 లకు మండపార్చనలు, గం|| 7-00 లకు స్వామివారికి ఎదుర్కోలు (వరపూజ), రాత్రి గం|| 11-00 లకు భక్తులచే పార్టీవ లింగాలకు మహన్యాసపూర్వక  " ఏకాదశ " రుద్రాభిషేకము, తె॥ఝా|| గం॥ 2-00 లకు "శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణము, ది.16-02-2026 ఉదయం గం|| 7-00 లకు మండపార్చనలు, నవగ్రహ మండప దేవతాహావనము,

మహాపూర్ణాహుతి, ఆలయ బలిహరణ, కలశ ఉద్వాసన, అవబృదము, మహదాశీర్వచనము, ఉదయం గం॥ 11-00 ల నుండి అన్న సమారాధన (నారాయణ సేవ) సాయంత్రం గం॥ 4-00 లకు "స్వామివారి గ్రామోత్సవం" (ఊరేగింపు) కార్యక్రమాలు జరుపబడుతాయని, ఈ కార్యక్రమాలు ఆలయ అర్చకులు రవిచంద్రశర్మ బ్రహ్మత్వంలో నిర్వహింపబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సమస్యలో పాల్గొని శ్రీస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరారు.