24 August, 2026 | 10:30 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం

21-05-2026 03:06 PM

మాజీ జెడ్పిటిసి  అయిల రమేష్ 

సుల్తానాబాద్ , మే 21 (విజయ క్రాంతి):  ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరమని సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి,వాకర్స్అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అయిల రమేష్ అన్నారు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు గురువారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగింది,  ఈ సందర్భంగా డాక్టర్ అయిల రమేష్  మాట్లాడుతూ జీవితంలో క్రీడలు అనేది అత్యంత ఆవశ్యకమైనది ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఎదో ఒక క్రీడాలలోపాల్గొనాలని  పేర్కొన్నారు.

క్రీడలకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొనాలనిపేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, కందునూరి ప్రకాష్ రావు (పెద్దన్న) సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి, కౌన్సిలర్ లు శ్రావణి -రాకేష్, శోభ -శ్రీనివాస్,పెద్దపల్లి పేట సెక్రటరీ దాసరి రమేష్,ఖేలో ఇండియా కోకో కోచ్ గెల్లు మధుకర్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రణయ్, వెంకటేష్, కుమార్, అజ్జు, దుర్గాప్రసాద్ వాకర్స్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.