25 August, 2026 | 1:26 AM

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ

24-08-2026 10:28 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి నులకు సైబర్ సెక్యూరిటీ పై సోమవారం  శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అనుదీప్ ఫౌండేషన్ నిర్వాహకులు రవి,  ప్లేసెమెంట్ మేనేజర్ సాయి వరుణ్, శిక్షణ నిర్వాహకురాలు  కావ్య  పాల్గొని విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించారు.  సైబర్ సెక్యూరిటీ ద్వారా  కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు, డిజిటల్ డేటాను హ్యాకర్లు, వైరస్‌ల నుండి రక్షించడం, సైబర్ సెక్యూరిటీ అనేది డిజిటల్ దాడుల నుండి సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లు, ప్రోగ్రామ్‌లను రక్షించే ప్రక్రియ అని,

  ఈ సైబర్ దాడులు సాధారణంగా సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడం, మార్చడం లేదా నాశనం చేయడం; రాన్సమ్‌వేర్ ద్వారా వినియోగదారుల నుండి డబ్బును బలవంతంగా వసూలు చేయడం లేదా సాధారణ వ్యాపార ప్రక్రియలకు అంతరాయం కలిగించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.