ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..
21-05-2026 03:04 PM
- ఉట్నూర్ , మే 21 ( విజయ క్రాంతి ): ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పులు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్ గారు మాట్లాడుతూ భారత దేశంలో మొట్ట మొదటిగా టెక్నాలజీ ని పరిచయం చేశారని,సమాచార సాంకేతిక పితామహుడిగా పేరు పొందారు అన్నారు.యువత రాజకీయాల్లో రాణించాలి అని, ఆయన ఆకాంక్షించారు, దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసింది అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిసార్, ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్, భాగ్యలక్ష్మి,జగదీష్ ,ఎస్పీ రెడ్డి, మహేందర్,తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు.






