5 May, 2026 | 2:48 AM

పేదలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది

05-05-2026 01:30 AM

వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రభుత్వ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, మే 4: ప్రజా పాలనలో అర్హులైన  పేదలు అందరూ ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంద ని పేదవాడు సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న కుటుంబ యజమానికి పట్టు వస్త్రాలు, నగదును అందజేశారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య శివుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, ఆలేరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బంధాలకు బిక్షపతి గౌడ్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి   గ్రామ ప్రజలు, మహిళలు, యువత, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.