తాండూర్ కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు
03-08-2026 07:41 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో కట్ట మైసమ్మ ఆలయం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కట్ట మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారికి అభిషేకం,పుష్పాలంకరణ, హోమం ఘనంగా నిర్వహించడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామంలోని పాడి సంపద మెరుగుపడాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి భూమా యాద గౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






