నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని వెంకట్రావ్ పేట్ కాంగ్రెస్ నాయకులను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోమవారం సాయంత్రం పరామర్శించారు. గంపలపల్లిలోని రాందేని పెద్ద వెంకటేష్ తండ్రి రాందేని మల్లేష్, మోదేలలోని పాదం శ్రీనివాస్ తండ్రి పాదం లింగయ్య, వెంకట్రావ్ పేట్ కు చెందిన నలిమేల పోచమల్లు ఇటీవల మృతి చెందారు.
ఆ కుటుంబ సభ్యులను, కలిసి పరామర్శించారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, నాయకుని బాధ్యత నాదేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగభూషణం, పూర్ణ చందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలినర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాతరాజు రాజేష్, మడిపెల్లి స్వామి,సురేష్ నాయక్, కార్యకర్తలు తదితరులున్నారు.






