16 May, 2026 | 1:08 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం

16-05-2026 12:12 AM

నాగిరెడ్డిపేట,మే 15 (విజయ క్రాంతి):మండలములోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ...తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి పనులు గురించి,అందచేస్తున సంక్షేమ పథకాలు అమలు గురించి గ్రామాలలో మరింత తీసుకెళ్లాలని సూచించారు.

ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.అంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైనటువంటి శ్రీధర్ గౌడ్ను మర్యాదపూర్వకంగా నాయకులు కార్యకర్తలు శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి,ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య,నాయకులు,గ్రామ అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.