16 May, 2026 | 1:07 AM

నల్లాలకు మోటార్లు పెట్టొద్దు

16-05-2026 12:12 AM

తాడ్వాయి, మే, 15 (విజయక్రాంతి): తాగునీటిని సరఫరా చేసే  నల్లాలకు మోటర్లు పెట్టవద్దని తాడ్వాయి గ్రామపంచాయతీ పాలవర్గం తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోగల నల్లాల మోటార్లను శుక్రవారం పరిశీలించారు. ఎవరైతే నల్లాలకు మోటర్లు బిగించారో వాటిని తొలగించి వేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... మరోసారి ఎవరైనా నల్లాలకు మోటర్లు పెట్టినట్లయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం, చట్ట ప్రకారం అలాంటి వారిపై చర్యలు తీసుకోబడతాయన్నారు. ప్రజలు నల్లాలకు మోటర్లు పెట్టకుండా సహకరించాలని కోరారు. మోటర్లు పెట్టినట్లయితే కింది వారికి నీళ్లు వెళ్లకపోవడంతో ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ మెట్టు విజయ రాములు, కార్యదర్శి, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.