16 May, 2026 | 2:09 AM

ఐపీఎల్‌కు రికార్డ్ వ్యూయర్ షిప్

16-05-2026 01:07 AM

ముంబై, మే 15 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026వ సీజన్ వ్యూ యర్ షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టిం చింది. దేశంలో ఐదు రా ష్ట్రాల ఎన్నికల హడావుడిలోనూ భారీ వ్యూ యర్ షిప్‌ను నమోదు చేసింది. టీవీ, డిజిటల్ వ్యూస్‌లో భారీగా పెరుగుదల కనిపించింది. రెండింటిల్లోనూ దాదాపు 1.1 బిలియన్ వ్యూస్ వచ్చినట్టు జియో హాట్ స్టార్ వెల్లడించింది. టీవీ వ్యూయర్ షిప్ కూడా 50 కోట్ల మార్క్ దాటిపోయింది. గత సీజన్‌తో పోలిస్తే డిజిటల్ విభాగంలో 15 శాతం పెరుగుదల నమోదైంది. మ్యాచ్‌లను వీక్షించిన స మయం కూడా ఏడు శాతం పెరిగింది.  ప్రాం తీయ భాషల్లోనూ వ్యూయర్ షిప్  గత సీజన్‌తో పోలిస్తే  42 శాతం  పెరిగినట్లు జియో తెలిపింది.