16 May, 2026 | 2:02 AM

భేషజాలకు పోవద్దు

16-05-2026 12:51 AM
  1. టిమ్స్ ఆస్పత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి
  2. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగితే రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది 
  3. సనత్‌నగర్ టిమ్స్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి) : కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా 1,200 కోట్లతో ఒక్కో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. వాటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టిమ్స్ ఆస్పత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావా లన్నారు.

హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యం అం దించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని తెలిపా రు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లో ఏయిమ్స్ స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు. శుక్రవారం సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని, అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.

ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్‌ను తీసుకువచ్చిందన్నారు. హైదరాబాద్‌లో సనత్‌నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆసుపత్రులను ప్రారంభిస్తే ఎక్కడ బీఆర్‌ఎస్‌కు మంచి పేరు వస్తుందోనని, భేషజాలకు పోవద్దని ఆయన చెప్పారు.

వరంగల్‌లో 2,000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రిని, నిమ్స్ ఆసుపత్రిని కూడా భారీ స్థాయిలో విస్తరణ చేపట్టినట్టు వివరించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో మొ త్తం మూడు బ్లాకులు నిర్మించామని తెలిపా రు. 300 ఐసీయూ బెడ్స్‌తో అత్యవసర వై ద్య సేవలు అందుబాటులో ఉంటాయని పే ర్కొన్నారు. రోగుల బంధువుల కోసం ప్రత్యే క ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది అని వ్యా ఖ్యానించారు.

16 అత్యాధునిక ఆపరేషన్ థి యేటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎం ఆర్‌ఐ, సిటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రత్యేక వీఐపీ సూట్స్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిడ్నీ సం బంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు జరిగేలా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. భారీ ఆడిటోరియం నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలిపారు. ఒకేసారి 1,000 కార్లు పార్క్ చేసేలా ఆధునిక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటి అని కేటీఆర్ పేర్కొన్నారు.

అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించామని, లిఫ్టుల పనితీరును వెంటనే మెరుగుపరచాలని అధికా రులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని గుర్తుచేశారు. మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.