ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన సంఘ చైర్మన్
చౌటుప్పల్, మే 15 : పి ఏ సి యస్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ లింగోటం వరి ధాన్యం కొనుగోలు కేంద్రము సంఘ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి శుక్రవారం సందర్శించి కొనుగోలు వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లారీల కొరత వల్ల దిగుమతి 5, 6 రోజులకు ఒకసారి దిగుమతి అవుతున్నాయని, తూకం వేసిన బస్తాలు ఎగుమతి కాక తూకం తగ్గుతున్నాయని తెలపడంతో వెంటనే జిల్లా సివిల్ సప్లై మేనేజర్ కు ఫోన్ చేసి సమస్యలు తీర్చాలన్నారు.
జిల్లా మేనేజర్ రెండు రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారన్నారు. ఏఎంసి చౌటుప్పల్ గోదాంలో హమాలిని పెంచుతామని త్వరగా దిగుమతులు అవుతాయన్నారు. తాళ్లసింగారం, ఎస్ లింగోటం సెంటర్లను ,ఏఎంసీ చౌటుప్పల్ గోదాములకు కేటాయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు, ఢిల్లీ మాధవరెడ్డి ,చిన్నగోని వెంకటేశం, ఆకుల అశోక్, రమేష్ బాబు , లింగస్వామి ,ఉప్పు కృష్ణ, వై రమేష్ పాల్గొన్నారు.






