ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
• అదనంగా రెండు కొత్త ప్లాట్ ఫామ్ లు, 13 రూట్లలో కొత్తగా బస్ సౌకర్యం
• సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆర్టిసి కరీంనగర్ ఈడీ సోలామన్ కరీంనగర్ ఆర్ఎం రాజు, జగిత్యాల డిపో మేనేజర్ తో కలిసి ధర్మపురి బస్టాండ్ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గానికి ఐటిఐ తో పాటు డిగ్రీ కళాశాల మంజూరు చేయించామని త్వరలోనే బస్సు డిపో సాధిస్తామని అన్నారు. ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు. ధర్మపురి నుండి నిత్యం 4వేల నుంచి 5వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రత్యేక నిధులతో బస్టాండ్ లో రెండు కొత్త ప్లాట్ ఫాంలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.






