ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.
ఈహెచ్ఎస్ నిబంధనలను రూపొందించి అమలు చేయాలి
కూసుమంచి,(విజయక్రాంతి): 27 వేల పాఠశాలలు అవసరం లేదని కేవలం 4 వేల పాఠశాలలు చాలని.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు ఖండించారు. కూసుమంచి మండల సబ్ కమిటీ సమావేశం మదనాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ... హెల్త్ కార్డుల విధివిధానాలు రూపొందించి వెంటనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన 15 వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎస్ ఉపాధ్యాయుల డిఎ బకాయిలు విడుదల చేయాలని, బకాయి ఉన్న ఐదు డిఎలను ప్రకటించాలని, హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పర్యవేక్షణ అధికారుల పదోన్నతులు చేపట్టాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని,2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని, కెజిబివి, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని,సమ్మె కాలపు వేతనం మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే సరైన మార్గమని పోరాటాలకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని కోరారు. జనాభా లెక్కలు పూర్తి అయినందున ఉపాధ్యాయుల బదిలీల ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు.
కూసుమంచి మండల సబ్ కమిటీ బాధ్యులు టి.నాగేందర్, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, వేరే సంఘంలో చేరడాన్ని కూసుమంచి మండల సబ్ కమిటీ అభినందించింది. గతంలో సంఘంలో పని చేసుకుంటూ రెండు మూడు మార్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి,క్రమశిక్షణ చర్యలకు గురికాబడినాడు. అప్పటినుండి నేటి వరకు తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రానందున టిపిటిఎఫ్ మండల సబ్ కమిటీ నుండి TPTFప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసి సంఘం నుండి టిపిటిఎఫ్ కూసుమంచి మండల సబ్ కమిటీ బహిష్కరించడం జరిగినది.






