రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి
డి.సీత లక్ష్మి ఐద్వా పట్టణ కార్యదర్శి
ధరల పెరుగుదలపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన
భద్రాచలం,(విజయక్రాంతి): పేదలందరికీ ఉచితంగా 14 రకాల నిత్యవసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించాలని ఐద్వా భద్రాచలం పట్టణ కార్యదర్శి డిసీతలక్ష్మి డిమాండ్ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలపై భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ... పచ్చిమాస్యాలో నెలకొన్న విద్య పరిస్థితులను సాకుగా చూపించి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అమాంతం పెంచేశారు.
ఆ ప్రభావంతో అన్ని రకాల నిత్యవసర వస్తువులపై పడి ధరలు ఆకాశానికి అంటుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగటం లేదని అన్నారు. వేతనాలు పెరగక నిత్యాసరా వస్తువులతో సహా కూరగాయల ధరలు సైతం మండిపోవడంతో పేదవాడి పూట గడవటం కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను ఉద్ధరిస్తున్నామని ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పే మోదీ సర్కార్ తన 12 ఏళ్ల పదవీకాలంలో ప్రతి వస్తువుపై 1200 సార్లు ధరలు పెంచారని ఆరోపించారు.
రాష్ట్ర పాలకులు సైతం కేంద్ర బాటలను ఉపయోగిస్తూ పేదోల ఆర్థిక పరిస్థితులను గాలికి వదిలేసి సంక్షేమం పేపర్లకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు 12 రకాల నిత్యవసర వస్తువులు ఉచితంగా రేషన్ షాపుల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వాజ్ సీనియర్ నాయకురాలు నాదెండ్ల లీలావతి జీవనజ్యోతి ఎం సుబ్బలక్ష్మి ఉస్తేల జ్యోతి పూర్ణ సీత తదితరులు పాల్గొన్నారు.






