15 June, 2026 | 7:52 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు

15-06-2026 06:35 PM

* అర్హులకు పని దినాలు కరువు...

* అనర్హులకు వరాలు...?

మాకు న్యాయం చేయాలి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు కూలీల నిరసన

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై సోమవారం కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన 120 రోజుల పనిదినాల హామీ అమలు కావడం లేదని, అర్హులైన కూలీలకు తగిన పనిదినాలు కేటాయించడం లేదని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొందరికి ఎక్కువ రోజులు, మరికొందరికి తక్కువ రోజులు మరికొందరికి పని దినాలు పెట్టటం లేదంటూ తనకు ఇష్టానుసారంగా పని పెట్టిన వారికి మళ్లీ పేర్లను నమోదు చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద కూలీలకు న్యాయం చేసి పారదర్శకంగా పనిదినాలు కేటాయించాలని వారు కోరారు.