దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన
దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలోని కెనరా బ్యాంక్ లో సోమవారం పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కామారెడ్డి ఎస్పీ.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దోమకొండ సబ్-ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నం:1930 కాల్ చేయాలనీ ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని బ్యాంకు ఆఫీసర్లు గాని పోలీస్ ఆఫీసర్లు గాని ఓటీపీలు చెప్పమని అడగరు. ఖాతాదారులు ఓటీపీలను ఎవరికీ కూడా చెప్పవద్దు అని సూచించారు.
అత్యవసర సమయంలో డయల్ 100, 112 కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్.రామంచ తిరుపతి.శేషరావు పిసిలు.ప్రభాకర్.సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, కామారెడ్డి షి టీమ్ మహిళా కానిస్టేబుల్ ప్రవీణ, బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బ్యాంక్ కస్టమర్స్ పాల్గొన్నారు.






