15 June, 2026 | 8:12 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు

15-06-2026 06:56 PM

* ధాన్యం నిలవలలో రైతుల జాగ్రత్తలు

డాక్టర్ మరియాదాస్

గరిడేపల్లి,(విజయక్రాంతి): గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకున్నట్లయితే రైతులు అధిక లాభాలని పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఏ మరియాదాస్ తెలిపారు. మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రంలో సోమవారం వేర్ హౌస్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ ఆక్ట్, నెగోషియబుల్ వేరే హౌస్ పై రైతులకు, వ్యాపారులు,పప్పు మిల్లు యజమానులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేర్ హౌసింగ్ నెగోషియబుల్ రిసిప్ట్ అంటే ఏమిటో వివరించారు.

వీటి ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందవచ్చు అనే అంశంపై వివరించారు. పొలాల్లో ఎలుకల యాజమాన్యం పై ఆయన క్లుప్తంగా వివరించారు. రైతులు ధాన్యం నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆహార ధాన్యాలను కాపాడుకోవచ్చని, లేకుంటే 10 నుంచి 30% దాన్యం చీడపురుగులు, ఎలుకల వల్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ధాన్యం నిలువపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిల్వ సమయంలో ఉపయోగించే హెల్మెట్రిక్ బ్యాగుల ఉపయోగాలను ఆయన వివరించారు.