నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ
15-06-2026 05:52 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన గ్రామస్తులు మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి చిన్నమనేని విద్యాసాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.నాగారం గ్రామంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విద్యాసాగర్ రావు గ్రామస్తులతో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. గ్రామంలో గతంలో జరిగిన సంఘటనలు, అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగగా, గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.






