ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి
15-06-2026 06:33 PM
ముకరంపుర,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలకు మాజీ విప్ ఆరెపల్లి మోహన్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ మృదు స్వభావి మల్లు భట్టి విక్రమార్క మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిలో భట్టి పాత్ర కీలకమని అన్నారు. కెసిఆర్ పాలన లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో భట్టి విక్రమార్క తన చతురతను ప్రదర్తిస్తున్నారని అన్నారు.






