8 March, 2026 | 1:00 AM

అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

06-03-2026 02:33 AM

అంగన్‌వాడీ పిల్లలతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

కొడంగల్, మార్చి 5: కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ని దుద్యాల మండలం  అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తీవరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుద్యాల మండల కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ దీపక్ తీవరి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలు ఎంత మంది ఉన్నారు, శ్యామ్ మ్యామ్ పిల్లలు ఎంత మంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు, శ్యామ్ మ్యామ్ పిల్లల  ఆరోగ్య పరిస్థితి పై ద్రుష్టి సా రించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, హాజరు నమోదు పుస్తకాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్ పిల్లలతో ముచ్చటించి వారికి అందిస్తున్న ఆహారం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయం అయినందున పిల్లల తో పాటు కలెక్టర్ భోజనం చేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న సప్లిమెంటరీ పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు . అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, పిల్లల ఆరోగ్యం మరియు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.