జోగులాంబ సన్నిధిలో ఎస్పీ ప్రత్యేక పూజలు
13-06-2026 12:37 AM
అలంపూర్, జూన్ 12 (విజయక్రాంతి): అలంపూర్ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికి స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు వంటి ప్రత్యేక పూజలు చేసి శాలువా పురమాలలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. వీరి వెంట డిఎస్పి మొగులయ్య, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్త్స్రలు రామకృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






