13 June, 2026 | 4:13 AM

ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ప్రారంభించిన అయిజ మున్సిపల్ చైర్మన్

13-06-2026 12:35 AM

అయిజ, జూన్ 12 (విజయక్రాంతి): అయిజ పట్టణంలోని అయిజ టూ రైచూర్ రోడ్డులో కేబిఆర్ బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియాన్ని అయిజ యువ క్రీడాకారుల ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ సురేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిజ పట్టణంలోని యువ క్రీడాకారులు తమ స్వంత కృషితో స్టేడియం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని క్రీడాల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం క్రమశిక్షణ చేకూరుతుందని అన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని తమ ప్రతిభను చాటుకున్నట్లయితే అటువంటి వారికి ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు క్రీడా అభిమానులు మరియు యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.