5 June, 2026 | 12:20 AM

పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు

04-06-2026 04:35 PM

నిర్మల్ జూన్ 4 (విజయ క్రాంతి): పోలీసు శాఖలో విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2026 సంవత్సరానికి నిర్మల్ జిల్లా నుండి 11 మంది పోలీసు అధికారులు, సిబ్బంది సేవా పథకాలకు ఎంపికయ్యారు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, సేవా పథకాలకు ఎంపికైన అధికారులను అభినందించారు , షేక్ అహ్మద్(ASI),ఆర్.గంగారాం(ASI),వై.గంగాధర్(ASI), డి.రాజారాం(HC),పి.మస్తాన్ రావు(HC),పి.రత్నారావు(HC), హెచ్.గంగాధర్(HC), బి.గోవింద్(HC), జె.గేమ్ సింగ్(ARHC),వెట్టి సింగ్(HC),కె.రమేష్(PC) లను అభినందించి పథకాలతో సత్కరించారు.

ఎస్పీ మాట్లాడుతూ... విధి పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందడం పోలీసు సిబ్బంది ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.సేవా పథకాలకు ఎంపిక కావడం గర్వకారణమని, ఇది మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల,ఐపీఎస్ తో పాటు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, ఆర్.ఐ రామ్ నిరంజన్ రావ్,పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.