4 June, 2026 | 11:20 PM

తెలంగాణలో ప్రజావంచక పాలన

04-06-2026 05:18 PM
  1. కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయ్
  2. కార్మికుడిపై భారం తగ్గాలన్నదే బీఆర్ఎస్ ఆలోచన
  3. రెండున్నరేళ్లలో పీఆర్సీపై ప్రకటన లేదు
  4. జలమండలి కార్మిక సంఘం ఎన్నికల సమావేశం

హైదరాబాద్: గతంలో లంచాలు(Bribes) లేకుండా ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు జరిగేవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) గేట్ మీటింగ్ లో హరీశ్ రావు ప్రసంగించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతు కావాలన్నారు. ఏడాది క్రితం పటాన్ చెరువులోని సిగాచి పరిశ్రమలో బాయిలర్ పేలి కార్మికులు చనిపోయారని హరీశ్ రావు గుర్తుచేశారు. మృతి చెందన కార్మికులకు రూ. కోటి పరిహారం ఇస్తామని చెప్పి ఏడాది గడిచిందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు.

తెలంగాణలో ప్రజా వంచకపాలన

తెలంగాణలో ప్రజా వంచకపాలన నడుస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో పీఆర్సీపై ప్రకటన లేదని ఆయన మండిపడ్డారు. జూన్ 2న ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తే.. నిరాశే ఎదురైందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు డీఏలు పెండింగ్ పెట్టారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, సింగరేణి కార్మికులకు ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి ఆరోపించారు. గతంలో తాము 650 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతును గెలిపిస్తే.. సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. మూడు కార్పొరేషన్ల చేసిన HMWS మాత్రం అలాగే ఉందన్నారు. మూడు కార్పొరేషన్లు పెరిగితే HMWS కార్మికులను ఎందుకు పెంచరు? అని ప్రశ్నించారు. కార్మికుడిపై భారం తగ్గాలన్నదే బీఆర్ఎస్ ఆలోచన.. కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అన్నారు.