18 April, 2026 | 7:04 PM

ప్రమాదవశాత్తూ జొన్న పంట దగ్ధం

18-04-2026 12:00 AM

పంటకు నిప్పు పెట్టారని అనుమానితునిపై పోలీసులకు ఫిర్యాదు

బోథ్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన రైతు నవ్వ రామకృష్ణ కు చెందిన జొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయింది. తన ఏడు ఎకరాలలో జొన్న పంట కోత కోసి నిల్వ ఉంచారు. అగ్ని ప్రమాదంలో జొన్న పంటతో పాటు వ్యవసాయ క్షేత్రంలోని 30 పైపులు కాలిపోవడం జరిగిందని బాధితుడు రామకృష్ణ తెలిపారు.

స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో శుక్రవారం బోథ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. కాగా ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావాలని పంటను దగ్ధం చేసిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందన్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం ఇచ్చామని తెలిపారు. కాగా దాదాపు 80 వేల రూపాయల వరకు నష్టం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మెరుపు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్త్స్ర పురుషోత్తం తెలిపారు.