విద్యుత్ షాక్ తో రైతు మృతి
10-07-2026 06:38 PM
బోధన్,(విజయక్రాంతి): నవీపేట్ మండలం నిజాంపూర్ కు చెందిన పల్లె లక్ష్మణ్ (42) విద్యుత్ షాక్తో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు స్టార్టర్కు వైర్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






