రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి తలవంచుతా
3000 ఎకరాలు 2000 రైతులకు సీలింగు భూమి పట్టాలు
నూతన మండల పార్టీ అధ్యక్షులు.. అభివృద్ధి వైపు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి,( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల దృష్ట్యా 9వేల కోట్ల రైతు భరోసా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు మాత్రమే తలవంచుతానని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన అధ్యక్షుడు రేగటి గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన అధ్యక్షుల ఎంపికకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య సహకారంతో ఎంపిక జరిగినట్టు తెలిపారు.
ఎంపికైన నూతన అధ్యక్షులు పాత, కొత్త నాయకులతో కలుపుకుపోయి, అభివృద్ధివైపు గ్రామాలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో సుమారు 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగినట్లు తెలిపారు. నూతనకల్ మండలం ఎర్రబాడులో గల సుమారు 3000 ఎకరాల సీలింగ్ భూమిని, రెండువేల రైతులకు పట్టాలిస్తామని ,దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగిందని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తుదిని నివేదిక జిల్లా కలెక్టర్కు పంపినట్లు తెలిపారు. ఎవరికి నేను భయపడను, కేవలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మాత్రమే నేను తలవంచుతానని, చెప్పగా, చప్పట్లతో సమావేశం మార్మోగింది. నియోజకవర్గ కార్యకర్తలు కి, నూతన మండల అధ్యక్షులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు.
ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతుందని, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బిఎల్వోలు కాంగ్రెస్ ఓట్లు పోకుండా, ఇంటింటికి తిరుగుతూ, ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందే విధంగా కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఏదైనా సరే, కాంగ్రెస్ పార్టీ విజయ డంక మ్రోగుటకు అందరం సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పచ్చిపాల వెంకన్న, వెంకట బిక్షం, మధుకర్ రెడ్డి, సుంకర జనార్ధన్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు పాల్గొన్నారు.






