కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది
-గత ప్రభుత్వం తప్పిదం వల్ల కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనుల వల్ల పిల్లర్ కుంగిపోయింది
-గత బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలగా మారింది
-గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు విఫలమైనందున మామ కేసీఆర్ పక్కన పెట్టిండు
- కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చారు
- కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చెప్పినట్టుగా బిఆర్ఎస్ పార్టీకి 1400 కోట్లు కాలేశ్వరం కమిషన్
-రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్,జూలై10 (విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పణిగిరి రామస్వామి గుట్ట మోడల్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు... కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి ఇసుక దిబ్బల మీద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.
నేషనల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు కాలేశ్వరం ప్రాజెక్టులో నీరును నింపడం లేదని అన్నారు. కాలేశ్వరంలో నీటిని స్టోరేజ్ చేస్తే కింద గ్రామాలు కొట్టుకొని పోతాయని నిపుణుల సూచనలు పాటిస్తున్నామన్నారు. గడిచిన మూడు సంవత్సరములో కాలేశ్వరం బ్యారేజీలో ఒక చుక్క నీటిని వాడకుండా యావత్ భారత్ దేశంలోనే అత్యధికంగా వరి పంటను పండించి తెలంగాణ రాష్ట్రం అనుదైన ఘనతను సాధించిందన్నారు.గత ప్రభుత్వంపై కక్ష సాధింపులు సాధించకుండా ప్రతి పైసా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగిస్తున్నామన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు విఫలమై నందున వారి మామ కేసీఆర్ పక్కన పెట్టిండని ఎద్దేవా చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చెప్పినట్లుగా కాలేశ్వరం కమిషన్ 1400 కోట్లు బిఆర్ఎస్ పార్టీకి చెక్కు రూపంలో అందిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన కెసిఆర్ కుటుంబం మళ్లీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రజాప్రభుత్వం సిడబ్ల్యూసి నిపుణుల,సలహాలు సూచనలు పాటించి కాళేశ్వరం బ్యారేజీ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి నరసయ్య,మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్,కోతి సంపత్ రెడ్డి,దొంతిరెడ్డి పద్మ,అడ్లురి మంజుల,పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి,సీఐ చరమందరాజు,తదితరులు, పాల్గొన్నారు.






