17 April, 2026 | 11:17 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి

17-04-2026 09:55 PM

* గిరిజన సంఘం నాయకులు హర్షం

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలం కీతవారి గూడెం గ్రామానికి చెందిన గరిడేపల్లి ప్రెస్ క్లబ్ చైర్మన్, బీసీ నాయకులు కొండ సైదులు గౌడ్ కుమారుడు బీసీ ముద్దుబిడ్డ దీపక్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థ ప్లేండర్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కోర్సులో గ్రాడ్యుయేషన్ విజయవంతం చేసిన సందర్భంగా శుక్రవారం గిరిజన సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేయడం గర్వకారణమని, దీపక్ కుమార్ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గిరిజన నాయకులు తెలిపారు. కృషి, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో రాణించగలరని దీపక్ కుమార్ నిరూపించాడని అన్నారు.