10 July, 2026 | 7:26 PM

అభివృద్ధిపై వాస్తవాలు మాట్లాడు అవినీతి చేసింది ఎవరు అందరికీ తెలుసు

10-07-2026 06:34 PM

బోథ్,(విజయక్రాంతి): రెండు సంవత్సరాలు అధికారంలో ఉండి సోనాల మండలానికి చేసింది ఏమీ లేదని అయినా మీరు మాపైన వ్యక్తిగతంగా మాట్లాడడం సరైనది కాదని మాజీ ఎంపీపీ పై టిపిసిసి తెలంగాణ రాష్ట్ర విచారి విభాగ్ కన్వీనర్ తుల అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తపరిచారు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండగా మండలాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. గతంలో ఉపాధి హామీ సందర్భంగా మీరు చేసిన అవినీతి వల్ల అప్పటి ఎంపీడీవో సస్పెండ్ కావడం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.

ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. తాను ఎలాంటి పదవులు లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మండల కేంద్రంలో అభివృద్ధి పనులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు చేసింది తాను ఏనాడు చెప్పుకోలేదని వ్యక్తిగత ప్రచారం నాకు అవసరం లేదు అని పేర్కొన్నారు సోనాలలో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ధి పనులను నా విజ్ఞప్తి మేరకే మంజూరి చేయించడం జరిగిందని పేర్కొన్న విషయాన్ని గుర్తించాలన్నారు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడవద్దని అభివృద్ధిపై నిర్మాణాత్మక చర్చ చేయడం మంచిది అని పేర్కొన్నారు