10 July, 2026 | 7:52 PM

Breaking News

13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •  

ఎస్పీఎంలో క్యాంటీన్ సౌకర్యం కల్పించాలి

18-04-2026 12:00 AM

కాగజ్‌నగర్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికులకు వెంట నే క్యాంటీన్ సహా ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు జే. మల్లికార్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వై. మోహన్బాబును కలిసి సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మెమో రాండం సమర్పించారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్లో సుమారు 2,188 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇందులో పర్మినెంట్, కాంట్రాక్ట్, జాబ్ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నప్పటికీ మిల్లు పునఃప్రారంభమై ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటివరకు క్యాంటీన్ సౌకర్యం కల్పించలేదన్నారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 46 ప్రకారం 250 మందికి పైగా కార్మికులు పనిచేసే ప్రతి కర్మాగారంలో తప్పనిస రిగా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ పాల్గొన్నారు.