10 July, 2026 | 7:48 PM

Breaking News

ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •   ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

విద్యాసంస్థల బందు విజయవంతం

10-07-2026 06:47 PM

- విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి

- వామపక్ష విద్యార్ధి సంఘాలు డిమాండ్

గుండాల, (విజయక్రాంతి): వామపక్ష విద్యార్ధి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో బంద్ విజయవంతం అయిందని ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాసిర్, పీడీఎస్యూ మండల అధ్యక్షులు షాహిద్ లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిని తక్షణమే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర చేసిందని వారు ఆరోపించారు.

తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేల క్లస్టర్ గా తగ్గిస్తామన్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలకు పిలుపునిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్ లేకుండా యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్లో ఉన్న 7000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల బంద్ కు సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎస్కే షబ్బీర్, యశ్వంత్ పీడీఎస్యూ నాయకులు రాహుల్, హర్ష తదితరులు పాల్గొన్నారు.