కన్న తండ్రికే తిండి పెట్టని కొడుకులు
కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు
సిద్దిపేట క్రైం, మార్చి 14 : ఆస్తి రాసిచ్చిన తర్వాత తండ్రికి కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి(94)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమా ర్తెలు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు.
నారాయణరెడ్డి తనకున్న ఏడు ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వయసు పైబడటంతో తమను చూసుకుంటారని ఆస్తిని అప్పగించగా, కొడుకులు మాట మా ర్చారు. తమను ఒక పాత ఇంట్లో ఉంచి, కనీ స సౌకర్యాలు కల్పించకుండా, సరిగా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశా రు.
ఎదురుతిరిగి ప్రశ్నిస్తే తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన సిద్దిపేట రూ రల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉం డగా, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్ మానవత్వం తో స్పందించారు. నేరుగా నారాయణరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఫిర్యాదును స్వీకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను తెలిపారు.




