19 May, 2026 | 10:07 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

గ్యాస్ కొరత.. ప్రసాదం బంద్

15-03-2026 12:21 AM

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అన్నదానం, ప్రసాదాల విక్రయాలు నిలిపివేత 

ఎల్బీనగర్, మార్చి 14: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఆలయాలను తాకింది. ఆలయాల్లో అన్నదానం, ప్రసాదాల తయారీకి ఎల్పీజీ గ్యాస్ వినియోగిస్తారు.  గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం, గ్యాస్ డిస్టిబ్యుటరీ కంపెనీలు కూడా గ్యాస్ సప్లై చేయలేమని చేతులెత్తేయడంతో ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో  స్వామివారికి నిత్యము జరిపే ఆరగింపులను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో లావణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఆదివారం నుంచి భక్తులకు ప్రసాద వితరణ, భోగములు, నిత్యాన్నదానం, ప్రసాదాలు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.