పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన
19-05-2026 08:32 PM
కొండపాక: కుక్కునూరు పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర బృందం సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర బృందం ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. బిపి, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు పరీక్షలు( స్క్రీనింగ్), మందుల పంపిణీ విధానం, రికార్డులను క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేశారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ సి డి సర్వేను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజలలో అవగాహన పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారులు, పిహెచ్ సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






