19 May, 2026 | 8:55 PM

మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం

19-05-2026 07:55 PM

మున్సిపల్ అధికారులు దృష్టికి ఎన్ని సార్లు చేరవేసిన పట్టించుకోని వైనం

ట్రాఫిక్ అంతరాయం పై పోలీసుల నిఘా జాడ లేదు

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో ప్రతి మంగళవారం మార్కెట్ సంత కొనసాగుతా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనాలకు ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇరువైపులా రోడ్లన్నీ స్తంభించిపోతాయి. రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు పూర్తిగా రహదారిని ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీనికి తోడు ఆటోలు నడిరోడ్ లో ఆపడంతో మరింత ఇబ్బందులు ఏర్పడతాయి.

తద్వారా వాహనాదారులకు బాటసారులకు, రాకపోకల యందు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి ఎక్కడికక్కడే స్తంభించి అస్తవ్యస్తం కావడం జరుగుతుంది. గతంలో చాలా సార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి ట్రాఫిక్ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం శూన్యం. ఇక మీదైనా సంతకు వచ్చే చుట్టూ గ్రామాల ప్రజలకు మున్సిపల్ పట్టణ ప్రజలకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి.