ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు
19-05-2026 07:49 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇందిరమ్మ పైలట్ గ్రామమైన అడవి సారంగాపూర్ గ్రామపంచాయతీని మంగళవారం మండల అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్, ఎంపీ ఓ సిహెచ్ రత్నాకర్ రావు తమ సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి ఇన్చార్జ్ మంత్రి కార్యక్రమం ఉన్నందున ఆ సందర్భంగా ఇందిరమ్మ జిల్లా ప్రారంభం ఇతర కార్యక్రమాలు ఉన్నందున అడవి సారంగాపూర్ అనుబంధ గ్రామాలైన జిలేడి కుంట, రాజుల మడుగు, గోండుగూడా, అడవి సారంగాపూర్ గ్రామాలను సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని ,ఇంటింటికి ఇంకుడు గుంత, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సెక్రెటరీ, గ్రామ ప్రజలు ఉన్నారు.






