15 March, 2026 | 4:42 AM

ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి

15-03-2026 12:19 AM

రోడ్డు నిర్మాణానికి రూ.950 కోట్లు  మంజూరు 

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

హయత్‌నగర్‌లో రూ.10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

ఎల్బీనగర్, మార్చి 14: ఎల్బీనగర్ నుం చి హయత్ నగర్ వరకు రూ. 950 కోట్ల వ్యయంతో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నామని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించనుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి  వెంకట్ రెడ్డి తెలిపారు.

హయత్ నగర్ లోని సాయిబాబా గుడి చౌరస్తా నుంచి జీ స్కూల్ వరకు రూ. 10 కోట్లతో చేపట్టనున్న పాత జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తదితరులతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మెట్రో రైల్‌తో కూడిన డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి గడ్కారీని పలుమార్లు కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో నిధుల కేటాయింపు ఒప్పుకున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్ రెడ్డి, ఆర్‌ఎండ్బీ శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్, నేషనల్ హైవే సీఈ ధర్మా రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, పీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశే ఖర్‌రెడ్డి, రాగుల వెంక టేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గజ్జి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.