3 March, 2026 | 4:28 PM

ఘనంగా గోమాత పూజ

03-03-2026 12:00 AM

మేళ్లచెరువు, మార్చి 2 :  దక్షిణ కాశీగా  విరాజుల్లుతున్న మేళ్లచెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పుణ్యా వచనం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన పుష్పార్చన పూజలు అత్యంత ఘనంగా జరిగాయి.

అనంతరం గోపూజ మహోత్సవం భక్తుల కన్నుల పండుగ జరిగింది. నర్సంపేట పట్టణానికి చెందిన ఎర్రబెల్లి విద్యాసాగర్ రావు ధర్మపత్ని హిమబిందు, మేళ్లచెరువు గ్రామానికి చెందిన గోళ్ళ సంగయ్య ధర్మపత్ని పద్మావతి అదే గ్రామానికి చెందిన చింతరెడ్డి గోపాల్ రెడ్డి  జ్ఞాపకార్థం ధర్మపత్ని లక్ష్మమ్మ వారి ఆర్థిక సహకారంతో దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్లి లచ్చయ్య,ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగేళ్ళ శంబిరెడ్డి, ఆలయ పూజారులు, పాలకవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.